20 March, 2026 | 12:00 PM

శిల్పారామంలో ఉగాది ఉత్సవాలు

20-03-2026 12:00 AM

శేరిలింగంపల్లి,మార్చి 19(విజయక్రాంతి): మాదాపూర్ శిల్పారామంలో  శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ పురస్కరించుకొని గురువారం శిల్పారామం ఆవరణలో సంపాదకులు, జ్యోతిష్యులు  ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ ఆచార్యులు,సాగి కమలాకర శర్మ చే పంచాంగ పఠనం ఏర్పాటు చేశారు.

ఈ పరాభవ నామ సంవత్సరంలో మన భారతదేశం ఎలా ఉంటుంది, నవనాయక ఫలములు, పుష్కరాలు, ద్వాదశ రాశుల సంవత్సర ఫలితములు గురించి వివరంగా తెలియచేసారు. అనంతరం డాక్టర్ బిందు అభినయ శిష్య బృందంచే  ‘ఉగాది వైభవం ‘ కూచిపూడి నృత్య రూపకం ప్రదర్శించారు. కళాకారులు అనురాధ, కీర్తన, లక్ష్మి ప్రసన్న, గార్గేయి, యామిని, వైష్ణవి, దీక్షిత, కళ్యాణి, శ్యామల మొదలైన వారు పాల్గొన్నారు.