25 June, 2026 | 2:41 AM

‘ఇందిరమ్మ’ గృహ ప్రవేశానికి పారిజాత నర్సింహారెడ్డి

25-06-2026 01:30 AM

బడంగ్ పేట్ జూన్ 24:విజయ కాంతి మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ డివిజన్ పరిధిలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు తుళ్ళ నర్సింగ్ గౌడ్ నూతన గృహప్రవేశ మహోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్ర మానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి నూతన గృహాన్ని ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా లబ్ధిదారుడి కుటుంబ సభ్యులు ప్రజా ప్రభుత్వానికి, స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయడమే ధ్యేయంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నా రు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, బలింగని జంగయ్య, గిరికటి కృష్ణంరాజు, టేకుల శశిధర్ రెడ్డి, పగడాల ఉమేష్ తదితర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.