రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కరపత్రాలు విడుదల
బూర్గంపాడు,జూన్25,(విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గం పిలుపుమేరకు డిమాండ్స్ తో కూడిన కరపత్రంలను బూర్గంపాడు మండల కేంద్రంలో ఆ సంఘం నాయకులు గురువారం విడుదల చేసి అనంతరం అధికారులకు సమర్పించారు.
ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రైతుకూలీ సంఘం కార్యదర్శి పున్నం చంద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం వల్ల రైతాంగ సమస్యలు మరింత తీవ్రతరమవుతున్నాయని అన్నారు. రైతాంగానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, యూరియా డిఏపి, కాంప్లెక్స్ ఎరువులు సకాలంలో అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొర్సా వెంకటేష్,మడివి సోమయ్య, గోపి పాల్గొన్నారు.






