ఎస్‌ఐఆర్ నమోదు షురూ
అశ్వారావుపేట, జూన్ 25( విజయక్రాంతి) : అర్హులైన పౌరులను ఓటర్ల జాబితా లో చేర్చి, అనర్హుల ఓటర్లను జాబితా నుండి తొలగించేందుకు భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ ఐ ఆర్ ( స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ) కార్యక్రమాన్ని అశ్వారావుపేట తహసీల్దార్ డి కిషోర్ నారంవారిగూడెం లో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు ఉన్న ప్రతి ఒక్కరు బి ఎల్ ఓ లు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేసి తిరిగి అందజేయాలని తెలిపారు.
కొన్ని ఇండ్లకు వెళ్ళి తహసీల్దార్ ఫారాలు అందజేశారు. ఈ కార్యక్రమం జూలై 24 వరకు కొనసాగుతుందని తెలిపారు. దీని వలన దొంగ ఓటుకు అవకాశం ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నారంవారిగూడెం సర్పంచ్ మనుగొండ నాగమణి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిన్నంసెట్టి సత్యనారాయణ, గ్రామ పాలన అధికారి తిరపతి రావు, బి ఎల్ ఓ లు సంగా నాగలక్ష్మి, మాధవి తదితరులు పాల్గొన్నారు.






