14 August, 2026 | 8:16 PM

Breaking News

స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధిదారులను కార్యక్రమానికి తరలించాలి   •   60 ఏళ్లుగా జీవనాధారంగా ఉన్న మడిగపై వివాదం   •   పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన ఆర్డీవో   •   నేను ఎలాంటి అసైన్ భూమిని కబ్జా చేయలేదు   •   హనుమాన్ దేవాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తాం   •   ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఫోరం ఆసిఫాబాద్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఖర్గేకు సంఘీభావంగా ఆలేరులో కాంగ్రెస్ భారీ పాదయాత్ర, సత్యాగ్రహం   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •   సాగర్‌ ఎడమ కాలువకు నీళ్లు ఎప్పుడు..?   •  

ఆర్‌సీ 16లో..

26-10-2024 12:00 AM

లెజెండరీ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ‘దేవర’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించారు కానీ స్టార్‌డమ్‌ను అయితే సొంతం చేసు కోలేకపోయారు. ఇక టాలీవుడ్ అయితే ఆమెకు పెద్ద పీటే వేస్తోం ది. దీనికి కారణం శ్రీదేవి కూతు రిగా జాన్వీని తెలుగు ప్రేక్షకులు ఆదరించడమే.

‘దేవర’లో అయితే జాన్వీ ఉంది కానీ ఆమె పాత్ర నిడివి పెద్దగా లేదంటూ చాలా మంది పెదవి విరిచారు. దీనిపై రకరకాల కామెంట్స్ వచ్చాయి. రెండో భాగంలో ఆమె పాత్ర నిడివి బాగుంటుందనే వార్తలు వచ్చాయి. ఈ లోపే జాన్వీ అభిమానులకు కాస్త ఊరటనిచ్చే కబురు వినవస్తోంది. రామ్‌చరణ్ 16వ సినిమాలో జాన్వీ కథానాయికగా ఎంపికైనట్టు వార్తలొస్తున్నాయి.

బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేదుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. అప్పట్లో అయితే కథానాయికగా బాలీవుడ్ భామను ఎంపిక చేయనున్నారంటూ వార్తలొ చ్చాయి. ఆ బాలీవుడ్ భామ మరెవరో కాదు.. జాన్వీయేనని సమాచారం.  మొత్తానికి ఈ అభినవ అతిలోక సుందరికి టాలీవుడ్ బాగానే కలిసొస్తోందని చెప్పాలి.