24 May, 2026 | 2:48 AM

లెనిన్ వస్తున్నాడు

24-05-2026 01:44 AM

మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పీ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘లెనిన్’. అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్ 26న థియేటర్లలో విడుదల కానుంది. నాగార్జున సినీ జర్నీ ప్రారంభించి నలభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ‘లెనిన్’ మూవీ టీజర్‌ను విడుదల చేశారు.

‘మనోడు వస్తున్నాడు’ అనే డైలాగ్‌తో ఈ టీజర్‌పై హైప్ పెరిగింది. ‘నేను తప్పిపోయి రాలేదు మచ్చా.. మీ అందరినీ వెతుక్కుంటూ వచ్చిన’ అంటూ చిత్తూరు యాసలో అఖిల్ చెప్పిన డైలాగ్‌తో హీరో పాత్రలోని ఇంటెన్సిటీ అర్థమైంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్; సినిమాటోగ్రఫీ: లియోన్ బ్రిట్టో; ఎడిటింగ్: నవీన్ నూలి.