27 April, 2026 | 4:05 AM

గ్రామ గ్రామాన బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం జరుపుదాం

27-04-2026 02:31 AM

కోడి అమరేందర్ యాదవ్ పిలుపు

అశ్వాపురం, ఏప్రిల్ 26, (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్క రించుకుని రేపు ఏప్రిల్ 27, సోమవారం ఉదయం 10 గంటలకు గ్రామ గ్రామాన పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని అశ్వాపురం మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్ పిలుపునిచ్చారు.

భారత రాష్ట్ర సమితి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో పార్టీ జెండాను ఎగురవేసి, కార్యకర్తలతో కలిసి వేడుకలను విజయవంతంగా నిర్వహించాలని  కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని  సూచించారు.