15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

విద్యార్థి అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దాం

05-11-2025 08:10 PM

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): విద్యార్థి ఉద్యమంలో పనిచేస్తూ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, శాస్త్రీయ విద్య సాధన, సమానత్వ సమాజ స్థాపన కోసం పోరాడుతూ అమరులైన విప్లవ విద్యార్థి వీరుల ఆశయాలను కొనసాగిద్దామని పి.డి.ఎస్.యు రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.నరసింహారావు పిలుపునిచ్చారు. బుధవారం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు ముందు విప్లవ విద్యార్థి అమరవీరుల వారోత్సవాలను నవంబర్ 5 నుండి 11 వరకు పురస్కరించుకొని విద్యార్థి అమరవీరుల చిత్రపటాలకు పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించటం జరిగింది.

ఈ సందర్భంగా బి.నరసింహారావు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను విద్యార్థి లోకం ఐక్యంగా తిప్పికొట్టాలని అన్నారు. దేశంలో పేద వర్గాల విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలిపారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా కాషాయకరణను విద్యార్థులంతా ప్రతిఘటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. కాకతీయ యూనివర్సిటీ ప్రధాన కార్యదర్శి వి.కావ్య, ఉపాధ్యక్షులు పి. అనూష, శ్రీజ, లోకేష్, సహాయ కార్యదర్శులు సాధన, చందన, శ్రీకాంత్, నాయకులు గణేష్, బాలు, చారి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.