calender_icon.png 5 November, 2025 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తసంద్రంగా రామాలయం

05-11-2025 08:13:45 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయం ఆవరణలో సహస్ర దీపారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీపారాధన కార్యక్రమానికి మహిళలు తరలివచ్చారు. ఆలయంలోని శివయ్యను దర్శించుకున్న అనంతరం సీతా సమేత రామయ్యకు మొక్కులు చెల్లించారు. సాయినాథుడికి ప్రత్యేక హారతినిచ్చారు. దాదాపు 300 మంది మహిళలు దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.