calender_icon.png 5 November, 2025 | 10:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసి నాయక పోడ్ కుల దైవం భీమన్న దేవుని ఉత్సవాలు

05-11-2025 08:08:10 PM

నిజాంసాగర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలోని కొమలంచ గ్రామ భీమన్న గుడి వద్ద బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘనంగా పండగ జరుపుకున్నారు. గోదావరి నది ఉపనదైన మంజీరా నదికి భీమన్న దేవుని గదాలు తీసుకెళ్లి గంగా స్నానం చేయించి, భీమన్న దేవునికి అభిషేకం నిర్వహించారు. గంగ నీళ్లు తీసుకొని వచ్చిన మహిళలు, యువతీ యువకులు, కుల పెద్దలు, కళాబృందం తప్పెట్లతో ఆటపాటలతో ఊరేగింపుగా భీమన్న దేవుని మందిరంకి తీసుకొనివచ్చి, భీమన్న దేవునికి అభిషేకం చేశారు.

భీమన్న దేవునికి అలంకరణ పూజలు చేసిన తర్వాత అన్న ప్రసాదం భక్తులు స్వీకరించారు. పూజ తర్వాత ధర్బార్ కార్యక్రమం నిర్వహించారు. గురువారం అమ్మవారికి బోనాలు, పూజలు నిర్వహిస్తారు. కామారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామల నాయకపోడ్ కులస్థులు కుటుంబల వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా సంస్కృతి అధ్యక్షులు కొమ్ము రవి కుమార్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మొట్ట పెంటయ్య, జిల్లా కోశాధికారి సాయిబాబా, కూర్తి రవీందర్ శ్రీనివాస్, శంకర్, సాయిలు, బాలురాజు, సంజీవులు, టీ సాయిలు కాశీరం నారాయణ కుల పెద్దలు, ఉద్యోగులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.