మహోన్నతుడి బాటలో ఉద్యమిద్దాం
మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ దాత : శైలేష్ యాదవ్
జవహర్‌నగర్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి) : బీసీల ఆరాధ్య దైవం మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని జవహర్ నగర్ లో ఏర్పాటు చేయాలని జవహర్ నగర్ బీసీ ఐక్య వేదిక కమిటీ ఈ మేరకు గురువారం శైలేష్ యాదవ్ ను కలిసి పూలే విగ్రహాన్ని ఇవ్వాల్సిందిగా కోరగా తక్షణమే స్పందించిన శైలష్ యాదవ్ విగ్రహానికి అయ్యే పూర్తి ఖర్చును బీసీ ఐక్యవేదిక కమిటీకి అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక గౌరవ సలహాదారులు కారింగుల శంకర్ గౌడ్, జవహర్ నగర్ బిసి ఐక్య వేదిక అధ్యక్షులు మారోజు సోమాచారి, ఉపాధ్యక్షులు గొడుగు వేణు, ప్రధాన కార్యదర్శి, శనిగ రం నరసింహ రజక, కోశాధికారి రేగోటి సురేష్ నేత, కార్యదర్శిలు పాక దేవేందర్, వల్లెపు మల్లేష్, కాసోజు రమేష్ చారి, రామ్ బ్రహ్మచారి, గాలయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.




