11 March, 2026 | 5:46 AM

ఉద్యమకారుల హామీలను సాధిద్దాం

11-03-2026 01:04 AM

జేఏసీ నేత ఎం నరసయ్య

ముషీరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయిన మార్చి10 మిలియన్ మార్చ్ స్ఫూర్తితో ముందుకు సాగుతూ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను సాధిద్దామని తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, ఆనాటి ముషీరాబాద్ జేఏసీ చైర్మన్ ఎం. నరసయ్య అన్నారు. ఈ మేరకు మంగళవారం రాంనగర్ చౌరస్తా అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ మిలియన్ మార్చ్ కార్యక్రమాల్లో ముషీరాబాద్ జేఏసీది కీలక పాత్రని కొనియా డారు.

ముషీరాబాద్ జేఏసీ నేతలు ఆరోజు ట్యాంక్ బండ్ అడుగుపెట్టిన మొదటి జాబితాలో నిలిచారన్నారు. గ్రేటర్ హైదరా బాద్ లోని ముషీరాబాద్ నియోజకవర్గం అత్యం త కీలకంగా పాల్గొని అన్ని కార్యక్రమాలు విజయవంతం చేశారని గుర్తు చేశారు. మిలియన్ మార్చ్ స్ఫూర్తిగా ఉద్యమకారులను గుర్తించేందుకు కృషి చేస్తామని, రాష్ట్ర ప్రభు త్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను సాధించేందుకు మరింత ఉద్యమిసా మని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో జేఏసీ నాయకులు కేబుల్ రవి, రోషం బాలు, కే. వెంకటేశ్వర్లు, ముత్యం బాలరాజు గౌడ్, బుజ్జి వెంకటేశ్వర రావు, కాకునూరి సుధాకర్, నర్సింగ్ ముదిరాజ్, కమలాకర్ రెడ్డి, కే. శ్రీనివాస్, బిక్షపతి యాదవ్, సహదేవ్ తదితరులు పాల్గొన్నారు.