సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం
11-03-2026 01:02 AM
తాడ్వాయి, మార్చి, 10 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంగోజి వాడి గ్రామంలో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ చిత్రపటాలకు ప్రతినిధులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామానికి మహిళా సంఘ భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
మహిళలు సంఘటితంగా ఉండడం కోసం ఒక భవనం అవసరమని తెలపడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యేను మర్చిపోలేమన్నారు అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ ఎల్లారెడ్డి నియోజకవర్గ అధ్యక్షులు గైని శివాజీ, ఉపసర్పంచ్ భాస్కర్ రావు, ప్రతినిధులు ఖయ్యుం, రాంబాబు, బాలరాజు, హామీద్, గరిడె యశోద, సరోజ తదితరులు పాల్గొన్నారు.




