15 June, 2026 | 10:23 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ఆనందోత్సాహాలతో న్యూ ఇయర్ వేడుకలు శాంతియుతంగా జరుపుకొందాం

30-12-2025 02:02 AM

న్యూ ఇయర్ వేడుకల పేరుతో ప్రజా భద్రతకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 29 (విజయక్రాంతి):ఆనందోత్సాహాల మధ్య కుటుంబ సభ్యులతో కలసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.

డిసెంబర్ 31న పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృ తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, వాహన తనిఖీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నూతన సంవత్సరం సం దర్భంగా నిర్వహించే ఏ కార్యక్రమమైనా తప్పనిసరిగా పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలని,ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా నిబంధనలకు విరుద్ధంగా డీజే లు,అధిక శబ్దం వచ్చే బాక్స్లు ఏర్పాటు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని హెచ్చరించారు.

పోలీసుల సూచనలు 

డిసెంబర్ 31న టపాసులు, మైకులు వినియోగించి ప్రజలను ఇబ్బంది పెట్టితే కఠిన చర్యలు తీసుకుంటాం.డిసెంబర్ 31న జిల్లా వ్యాప్తంగా డీజేలు పూర్తిగా నిషేధం. నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తే డీజేలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తాం.మద్యం మత్తులో వాహనాలు నడపడం,ర్యాష్ డ్రైవింగ్ చేయడం,వాహనాల సైలెన్సర్ తొలగించి శబ్ద కాలుష్యం సృష్టింసిచిన ,త్రిబుల్ రైడింగ్ చేయడం లాంటి చర్యలకు పాల్పడితే కేసులతో పాటు జైలు శిక్ష విధించబడుతుంది.

ఇళ్లు, ప్రైవేట్ ఆస్తులు, వీధి దీపాలపై రాళ్లు వేయడం, ఆస్తులను ధ్వంసం చేయడం, మహిళలను ఇబ్బంది పెట్టడం లేదా అసభ్యంగా ప్రవర్తిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. నూతన సంవత్సర వేడుకలలో నిషేధిత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయం లేదా వినియోగానికి పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ స్థలాల్లోమద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తాం.

మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే, వారికి వాహనాలు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తాం. వారి వల్ల ప్రమాదం జరిగితే సంరక్షకులపై కూడా చర్యలు తీసుకుంటాం.పై నిబంధనల ఉల్లంఘనలపై ప్రజలు వెంటనే డయల్ 100 కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించి కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు.

ప్రజలు,యువత నూతన సంవత్సర వేడుకలను తమ కుటుంబ సభ్యులతో కలిసి శాంతియుతంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలన్నారు.2026 సంవత్సరంలో ప్రజలందరికి మంచి కలగాలని ఆశిస్తూ , జిల్లా ప్రజలకు పోలీస్ శాఖ తరుపున నూతన సంవత్సర శుభాకాంక్షలు.