15 June, 2026 | 11:41 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

పాత్రికేయులకు తప్పకుండా న్యాయం చేస్తాం

30-12-2025 02:01 AM

నిర్మల్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న పాత్రికేయులకు ఇండ్ల స్థలాలు ఇప్పించే విధంగా కృషి చేస్తామని జిల్లా గ్రంథాలయ చైర్మన్ స య్యద్ అర్జున్ అలీ, పెన్షన్లు సంఘం జాతీయ కార్యదర్శి లింగన్న, మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో పాత్రికేయులు నిర్వహిస్తున్న దీక్ష శిబిరాన్ని సోమవారం సందర్శించి చర్చ లు జరిపారు. ఈ విషయాన్ని జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకు వచ్చామని త్వరలో అన్ని రాజకీయ పార్టీలు ఉద్యోగ సంఘాలతో ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకొని వారం రోజుల్లో సమస్య పరిష్కరించేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. 

ఇదిలా ఉండగా ఏడో రోజు దీక్షకు ప్రముఖ వైద్యులు డాక్టర్ రమేష్ రెడ్డి, సిపిఐ నాయకులు విలాస్ రమేష్, ఎస్‌ఎన్ రెడ్డి, యాదవ సంఘం నాయకులు మనోజ్ యాదవ్, పార్టీ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ , పైవేట్ విద్య కళాశాల నిర్వాకులు వెంకటరెడ్డి, అఖిలేష్ కుమార్, ఉద్యమకార్డు ఇస్మాయిల్ బీఆర్‌ఎస్ పార్టీ నేతలు రామకృష్ణారెడ్డి, మార్గొండ రాము  తదితరులు సంఘీభావం తెలిపి మద్ద తు పలికారు. ఏడో రోజు దీక్షలో తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని పాత్రికేయులు డిమాండ్ చేశారు.