15 April, 2026 | 11:07 AM

బెజ్జూర్ నుంచి కరీంనగర్‌కు ఆర్టీసీ బస్సు

30-12-2025 02:02 AM

బెజ్జూర్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రం నుంచి కరీంనగర్కు ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు సోమవారం ప్రారంభమైంది. ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు బస్సు బెజ్జూర్ నుంచి బయలుదేరి కౌటాల, కాగజ్నగర్, మంచిర్యాల, గోదావరిఖని మీదుగా కరీంనగర్కు చేరుకుంటుందని ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు.ఈ బస్సు వేములవాడ, కొండగట్టు, హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొ ని బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.