calender_icon.png 20 May, 2025 | 12:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పటిలా చూస్తూ ఊరుకోం

11-05-2025 01:51:05 AM

- శాంతి వచనాలు పటించే రోజులుకావివి

- మోదీ హయాంలో భారత్‌పై దాడి చేయాలంటే వణకాలి

- కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

- సైనికుల్లో ఆత్మస్థుర్యైం కోసం బషీర్‌బాగ్ కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు

హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): పాకిస్థాన్ సైనికులు, ఉగ్రవాదులంటే చంపేవాళ్లని.. మనం చచ్చేవాళ్లమనేలా గతంలో పరిస్థితి ఉండేదని.. ఇప్పుడంతా తలకిందులైందని, గతంలోలాగా చూస్తూ ఊరుకోమని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర కిషన్‌రెడ్డి పాకిస్థాన్‌ను హెచ్చరించారు.

దాడులు చేస్తే శాంతి వచనాలు పలికే రోజులు పోయాయని.. నరేంద్ర మోదీ నాయకత్వంలో పహల్గాం ఉగ్రదాడికి దీటైన జవాబు ఇచ్చినట్టు తెలిపారు. భారత సైనికులు ధైర్యంతో, సాహసం తో వీరోచితంగా వెళ్లి పాకిస్థాన్‌లోని 9 ప్రాం తాల్లో ఉగ్రవాదుల శిక్షణా కేంద్రాలు, ఉగ్రవాదుల ఇండ్లను మట్టుబెట్టినట్టు వెల్లడించారు.

ప్రధాని మోదీ హయాంలో దేశంపై దాడి చేయాలంటే వణికేలా పరిస్థితులు ఉన్నాయన్నారు. ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యంగా పోరా టం చేస్తున్న భారత సైనికులకు ఆత్మస్థుర్యైం, శక్తి, విజయం కలగాలని కోరుతూ బషీర్‌బాగ్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కేంద్రమంత్రి శనివారం ప్రత్యేకపూజలు చేశారు.

దేశ భద్రత కోసం పోరాడుతున్న యోధులకు అమ్మవారి ఆశీర్వాదం సదా ఉంటుందని తెలిపారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పాక్ దుశ్చర్యలకు వ్యతిరేకంగా భారత సైన్యం వీరోచితంగా పోరాటం చేస్తోందన్నారు. ఉగ్రవాద దాడికి పాక్ క్షమాపణ చెప్పాల్సింది పోయి, మన దేశంలోని అనేక ప్రాంతాల్లో పౌర నివాసాలపై, సైనిక శిబిరాలపై దాడులు చేస్తోందని, అమాయక ప్రజలపై కాల్పులు జరుపుతోందన్నారు. మన సైనికులు పాక్‌లోని అనేక కీలక ప్రాంతాల్లో, ఉగ్ర శిక్షణా కేంద్రాలపై దాడులతో తగిన బుద్ధి చెప్పినట్టు తెలిపారు. 

ఆది నుంచి అదే తీరు..

అనేక ఏళ్లుగా మన దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయాలని, దేశ సమగ్రత, సమైక్యతను దెబ్బతీయాలని, దేశ అభివృద్ధిని అడ్డుకోవాలని పాకిస్థాన్ అనేక ప్రయత్నాలు చేస్తోందని కిషన్‌రెడ్డి వాపోయారు. గతంలో భారత సైనికులను, పౌరులను కిరాతకంగా హత్యచేసిందన్నారు.

హైదరాబాద్ లుంబినీ పార్క్, కోఠి గోకుల్‌చాట్‌లో, దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా టెంపుల్‌లో పాకిస్థానీ ఉగ్రవాదులు దాడులు జరిపి అనేకమంది అమాయ కులను పొట్టనబెట్టుకున్నారని గుర్తుచేశారు. మన దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలకు అతీతంగా.. అన్నివర్గాల ప్రజలు ఏకమై ముక్తకంఠంతో పాకిస్థాన్ దుశ్చర్యలను ఖండిస్తు న్నారని, మన సైనికులకు అండగా నిలబడ్డారని తెలిపారు.

దేశరక్షణ, సమైక్యత కోసం పాకిస్థాన్‌తో ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్న భారత సైనికులకు అండగా నిలబడేలా.. అన్ని దేవాలయాల్లో పూజలు చేయా ల్సిందిగా ప్రజలను కోరారు. అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లోనూ మన సైనికులకు మద్దతుగా, అండగా ర్యాలీలు నిర్వహించాలని కోరారు. సైనికులకు మరింత ఆత్మస్థుర్యైం కల్పించేలా పల్లె నుంచి పట్టణాల దాక సామూహిక ర్యాలీలు నిర్వహించి సంఘీభావాన్ని తెలియజేయాలన్నారు.