calender_icon.png 24 August, 2025 | 4:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాసేపట్లో ఎప్‌సెట్‌ ఫలితాలు

11-05-2025 10:25:05 AM

హైదరాబాద్: తెలంగాణ ఎప్‌సెట్‌(Telangana EAPCET 2025 results) ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. ఉదయం 112 గంటలకు ఎప్ సెట్ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) విడుదల చేయనున్నారు. ఇంజినీరింగ్, ఫార్మ, అగ్రికల్చర్ కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం ఎప్ సెట్ పరీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 29,30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్ష, 2,3,4 తేదీల్లో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఇంజినీరింగ్ విభాగంలో 2.07 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా, ఫార్మా, అగ్రికల్చర్ విభాగంలో 81,198 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఎప్ సెట్ అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు తెలుసుకునేందుకు అవకాశం కల్పించారు.