calender_icon.png 6 October, 2025 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సత్తా చాటుదాం

06-10-2025 12:00:00 AM

భద్రాచలం, అక్టోబర్ 5, (విజయక్రాంతి):రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి సత్తా చాటుదామని తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశం నిర్ణయించింది. భద్రాచలం పట్టణంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు తాళ్లూరు చిట్టి బాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్త లు విస్తృత స్థాయి సమావేశం కూనవరం రోడ్డులోని ఎన్టీఆర్ బొమ్మ వద్ద జరిగినది.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకు లు కొడాలి శ్రీనివాస్, కుంచాల రాజారాం, కంభంపాటి సురేష్ కుమార్ కార్యకర్తను ఉద్దేశించి మాట్లాడుతూ భద్రాచల పట్టణ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని, కరకట్ట నిర్మాణం,

సెంట్రల్ లైటింగ్ బ్రిడ్జి రోడ్డు నుంచి కూనవరం రోడ్డుచెర్ల రోడ్డువైపు వెళ్లే రోడ్లు 4లైన్ల రోడ్డు నిర్మాణం నూతన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం భద్రాచలంలో రామాలయం అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలోనే లో అభివృద్ధి జరిగిందని అన్నారు. రాబోయే ఎంపీటీసీ జడ్పిటిసి మరియు సర్పంచ్ వార్డ్ మెంబర్ల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించి భ ద్రాచలం ను అన్ని విధాల అభివృద్ధి చేసుకుందామని వారు పిలుపునిచ్చారు. .

ఈ కార్యక్రమంలో తా ళ్లూరు చిట్టిబాబు కొర్లపాటి రాము. ఊకె చుక్కమ్మ పరస ఆదినారాయణ చినిగిరి చిట్టి బాబు అ క్కుల  జ్యోతిర్మయి ( జ్యోతి) తాత భాగ్యలక్ష్మి రాజమండ్రి అచ్యుత రావు  పాల్గొన్నారు