06-10-2025 12:00:00 AM
మణుగూరు, అక్టోబర్ 5 (విజయక్రాంతి) : ఓపెన్ కాస్ట్ 2 లక్కీ క్రషర్ నుంచి భద్రాద్రి పవర్ ప్లాంట్ వరకు బొగ్గు సరఫరా చేసే లారీల నుండి ప్రతినిత్యం విపరీతంగా కోల్ డస్ట్ వెలువడుతుందని, టీబీజీకేఎస్ ఏరియా వైస్ ప్రసిడెంట్ నాగెల్లి వెంకటే శ్వర్లు ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పవర్ ప్లాంట్ కు కోల్ తరలింపు కోసం టెండర్ దక్కిం చు కున్న గుత్తేదారులు, బొగ్గు లోడింగ్ చేపట్టే లక్కీ క్రషర్ యాజమాన్యం సింగరేణి నిబంధనలను పాటించకుండా ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తూ కార్మికుల విలువైన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
లక్కీ క్రషర్ ద్వారా మూడు షిఫ్ట్ లలో సుమారు 270 లారీలకు పైగా బిటిపిఎస్ కు బొగ్గు సరఫరా జరుగుతుందని, లక్కీ క్రషర్ దగ్గర లారీలకు అధిక లోడులు ఇవ్వడంతో బొగ్గు లోడింగ్ జరిగిన ప్రదేశంలో లారీ డ్రైవర్లు పట్టాలు కట్టకుండా బొగ్గు తరలించడం వల్ల రహదారి వెంబడి మూల మలుపుల వద్ద విపరీతమైన బొగ్గు పెల్లలు గుట్టలు గుట్టలుగా పడుతున్నాయన్నారు.
సెకండ్ , నైట్ షిఫ్ట్ లలో ఈ తీవ్రత ఎక్కువగా ఉం డటం మూలంగా రాత్రి సమయాల్లో కొండాపురం భూగర్భగని, ఓ.సి 2 కు విధులకు రాకపోక లు సాగించే సింగరేణి కార్మికులు, కాంటాక్ట్ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆక్షేపించారు. పలు మార్లు రహదారి వెంబడి ప్రమాదాల జరిగి కార్మికులు ఆస్పత్రి పాలైన సంఘటన కూడా లేక పోలేదని ఆయన తెలిపారు.
లక్కీ క్రషర్ దగ్గర ఎలాంటి వాటర్ స్ప్రింక్లింగ్ లు ఏర్పాటు చేయకపోవడం వల్ల విపరీతమైన దుమ్ము ధూళి లేస్తుందని దానివల్ల విధులకు రాకపోకలకు సాగించే కార్మికు లకు రహదారి సరిగా కనపడటం లేదని ఫైన్ డస్ట్ పీల్చడం మూలంగా కార్మికులు శ్వాస కోశ వ్యాధుల బారిన పడే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సింగరేణి సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి కోల్ డస్ట్ నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రహదారి వెంబడి బొగ్గు పెల్లలు పడకుండా తగు చర్యలు తీసుకోవడంలో ప్రత్యేక చొరవ చూపాలని ఆయన కోరారు.