calender_icon.png 23 February, 2026 | 5:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలేశ్వరం ఎల్‌ఎంసీ కాలువ పనులపై కలెక్టర్‌కు వినతి పత్రం

23-02-2026 04:16:12 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు పరిధిలోని ఎల్‌ఎంసీ 11/6, 11/5, 11/4 కాలువల పెండింగ్ పనులను తక్షణం పూర్తి చేయాలంటూ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. రైతులకు సాగునీరు సకాలంలో అందేందుకు కాలువల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఈ సందర్భంగా కోరారు.

ఈ కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, బస్వాపూర్ సర్పంచ్ పుర్మాని రాజశేఖర్ రెడ్డి, రామన్నపల్లి సర్పంచ్ ఆత్మకూరు జ్యోతి అనిల్, అంకుషాపూర్ సర్పంచ్ అంచ శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మీపూర్ సర్పంచ్ నాయిని సాయికృష్ణ గౌడ్, పాపాయిపల్లి సర్పంచ్ చిన్నవేణి పరశురాములు పాల్గొన్నారు.

అదేవిధంగా రామన్నపల్లి ఉప సర్పంచ్ గణపురం శ్రీనివాస్, రామన్నపల్లె యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి మందాటి తిరుపతి తదితరులు హాజరై కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు.