27 July, 2026 | 12:27 PM

Breaking News

గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •   బావుసాయిపేట ఇసుక క్వారీ వద్ద రైతుల ఆందోళన   •   దూడను తిన్న చిరుత పులి   •   సోనాల పాఠశాల విద్యార్థులకు శుద్ధ జలం   •  

వజ్జపల్లి తాండ అభివృద్దికి కృషి చేస్తాను

23-02-2026 04:21 PM

ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు 

సదాశివనగర్,(విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. సోమవారం సదాశివనగర్ మండలం వజ్జేపల్లి తండా గ్రామంలో ఓ వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే గ్రామ పంచాయతిని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యను గ్రామ పంచాయతీ సర్పంచ్ సంధ్య పాలక వర్గం సభ్యులు సన్మానించారు. గ్రామ సమస్యలను ఎమ్మెల్యే కు వివరించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గ్రామపంచాయతీ తండాలకు నూతనంగా పంచాయతీ భవనాలు ఏర్పాటు చేస్తానన్నారు. వజ్జేపల్లి తండాలో నీటి సమస్య, పంచాయతీ భవన నిర్మాణం, రోడ్డు పనులను పరిస్కరం కోసం కృషి చేస్తానన్నారు. సర్పంచ్ సంధ్య-విజయ్ కుమార్ పాలక వర్గం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. విషయంపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే త్వరలో సమస్యను పరిష్కారం చేస్తానని  హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తాండ నాయకులు పాల్గొన్నారు.