12 June, 2026 | 12:02 PM

Breaking News

నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •   భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత   •   జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి   •   పగిడిద్దరాజు ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే పాయం చేయూత   •  

డెంగ్యూ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి

23-02-2026 04:12 PM

 జిల్లా మలేరియా అధికారి కె.రజిని

వరంగల్,(విజయక్రాంతి): డెంగ్యూ వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉండాలని వరంగల్ జిల్లా మలేరియా అధికారి కే.రజిని అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు ఆదేశాలను సార ప్రకారం ఈ రోజు వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని దేశాయిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గల నజీకేత్ పురంలో నమోదైన డెంగ్యూ బాధితుడి ఇంటిని వరంగల్ జిల్లా మలేరియా అధికారి కె. రజిని, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి ఈదురు అనిల్ కుమార్ క్షేత్రస్థాయిలో పర్యటించి బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ఇంటి పరిసరాలను పరిశీలించి డెంగ్యూ వ్యాధి పట్ల జాగ్రత్త చర్యలు పాటించాలని తెలిపారు.

జిల్లా మలేరియా అధికారి కే రజిని మాట్లాడుతూ... ఇంటి చుట్టుపక్కల నీరు నిలువ ఉండకుండా చూడాలని, దోమలు పుట్టకుండా కుట్టకుండా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని సూచించారు. మున్సిపల్ సిబ్బంది చేపడుతున్న ఆంటీ లార్వెల్ ఆపరేషన్ పరిశీలించి తగు సూచనలు చేశారు. వైద్య సిబ్బంది ఇంటింటి జ్వర సర్వే నిర్వహించి, జ్వర పీడితుల నుంచి రక్త నమూనాలు సేకరించి వైద్య చికిత్సలు అందించాలని ఆదేశించారు.

జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి ఈదురు అనిల్ కుమార్ మాట్లాడుతూ... ప్రజలు కూడా తమ సామాజిక బాధ్యతలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని తద్వారా వ్యాధుల బారిన పడకుండా స్వీయ రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో  ఆరోగ్య విస్తరణ అధికారులు  సదానందం, విజయేంద్ర కుమార్, మున్సిపల్ హెల్త్ సూపర్వైజర్ మధుకర్, రవి తదితరులు పాల్గొన్నారు.