సందీప్‌కు లైన్‌క్లియర్
11-06-2024 01:02 AM
కింగ్స్‌టౌన్: నేపాల్ వివాదాస్పద క్రికెటర్ సందీప్ లమిచానేకు టీ20 ప్రపంచకప్ ఆడేందుకు లైన్ క్లియర్ అయింది. ప్రపంచకప్ ఆడేందుకు వీసా క్లియరెన్స్ రావడంతో నేపాల్ ఆడనున్న తర్వాతి రెండు మ్యాచ్‌లకు సందీప్ అందుబాటులోకి రాను న్నాడు. అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సందీప్‌ను ఖాట్మం డూ హైకోర్టు నిర్దోశిగా తేల్చడంతో వెస్టిండీస్ రాయబార కార్యాలయం సందీప్‌కు వీసా మంజూరు చేసింది. నెదర్లాండ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్ లో ఓటమిపాలైన నేపాల్ నేడు శ్రీలంకతో తలపడనుంది.






