29 June, 2026 | 12:04 AM

భారత్ X ఖతార్

11-06-2024 01:01 AM

దోహా: ఫిఫా వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా మంగళవారం భారత ఫుట్‌బాల్ జట్టు ఖతార్‌తో కీలకపోరుకు రెడీ అయింది. ఫుట్‌బాల్ స్టార్ సునీల్ ఛెత్రీ రిటైర్మెంట్ ప్రకటించడంతో అతడు లేకుండా టీమిండియా తొలిసారి మ్యాచ్ ఆడనుంది. వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో మూడో రౌండ్‌కు చేరుకోవాలంటే భారత్‌కు ఈ మ్యాచ్ గెలుపు తప్పనిసరి. సునీల్ ఛెత్రీ లేకుండా పటిష్టమైన ఖతార్ జట్టును భారత్ ఎలా ఎదుర్కోనుందనేది ఆసక్తికరం. ఛెత్రీ స్థానంలో గురుప్రీత్ సింగ్ సంధూ కెప్టెన్‌గా జట్టును నడిపించనున్నాడు.