9 April, 2026 | 8:01 AM

మెస్సీ విగ్రహవిష్కరణ

13-12-2025 12:45 PM

కోల్‌కతా: అర్జెంటీనా సూపర్‌స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ తన మూడు రోజుల పర్యటనలో భాగంగా నాలుగు నగరాల 'గోట్ ఇండియా టూర్ 2025' కోసం శనివారం కోల్‌కతాకు చేరుకున్నారు. కోల్ కతాలోని లేక్ టౌన్ లో తన 70 అడుగుల విగ్రహాన్ని ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ఆవిష్కరించారు. తర్వాత సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ముందుగా అభిమానులను మెస్సీ కలవడంతో కరచాలనం చేసి ఆటోగ్రాఫ్ లు తీసుకున్నారు. తర్వాత టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ గంగూలీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీలను కలిశారు.

కాగా, తమ అభిమానిని చూసేందుకు వేలాది మంది డిసెంబర్ చలిని సైతం లెక్కచేయకుండా అర్ధరాత్రి దాటిన తర్వాత వరకు వేచి ఉండి ఆయనకు ఘన స్వాగతం పలికారు. శనివారం తెల్లవారుజామున 2.26 గంటలకు బార్సిలోనా ఫుట్‌బాల్ దిగ్గజం నగరంలో అడుగుపెట్టడంతో, ఆ నగరం ఉత్సాహంతో ఉర్రూతలూగింది. అంతర్జాతీయ రాకపోకల విభాగంలోని గేట్ 4 నినాదాలు, జెండాలు, మెరుస్తున్న ఫోన్లతో హోరెత్తే సముద్రంలా మారిపోయింది. అభిమానులు తమ అభిమాన క్రీడా తారను ఒక్క క్షణం చూడటానికైనా గేట్ల మధ్య పరుగులు తీశారు.