ప్రయోగాలు ఆపేయ్
టీ ట్వంటీ ప్రపంచకప్‌కు ఇంకా రెండు నెలల సమయం కూడా లేదు. ఈ మెగాటోర్నీకి ముందు అన్ని జట్లూ తమ కాంబినేషన్స్‌పై ఫోకస్ పెడితే, భారత్ మాత్రం ఇంకా ప్రయోగాలు చేస్తూనే ఉంది. ఈ విషయంలో హెడ్ కోచ్ గంభీర్ మితిమీరిన ప్రయోగాలు చేస్తూ జట్టును నాశనం చేస్తున్నాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.దీంతో వరల్డ్‌కప్‌కు ముందు ప్రయోగాలకు ఇక ముగింపు పలకాలంటూ పలువురు మాజీలు సైతం సూచిస్తున్నారు. అటు భారత క్రికెట్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో గంభీర్‌ను ఏకిపారేస్తున్నారు.
- గంభీర్‌ను ఏకిపారేస్తున్న ఫ్యాన్స్
హెడ్ కోచ్‌పై మాజీల ఫైర్
మెగాటోర్నీకి ముందు అవసరమా ?
ధర్మశాల, డిసెంబర్ 12 : టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన స్వదేశీ మాజీలలో గంభీర్ ఎదుర్కొన్న విమర్శలు మరెవరూ ఎదుర్కోలేదన్నది చాలా మంది చెబుతున్న మాట. నిజమే గంభీర్ వచ్చిన తర్వాత ఈ స్థాయిలో విమర్శలు రావడానికి కారణం అతను చేస్తున్న ప్రయోగాలే. మితిమీరిన ప్రయోగాలు చేస్తుండడం ఇప్పుడు భారత క్రికెట్‌ను ఇబ్బందుల్లోకి నెడుతోంది. అతను బ్యాటిం గ్ ఆర్డర్‌లో చేస్తున్న ప్రయోగాలు, తుది జట్టు ఎంపికలో మార్పులే అని ఒప్పుకోక తప్పదు. తాజాగా సౌతాఫ్రికా టీ20 సిరీస్‌లోనూ ఇది రుజువవుతూనే ఉంది.
ఏ ఫార్మాట్‌లోనైనా కీలకంగా భావిం చే మూడో స్థానంతో గంభీర్ చేస్తున్న ప్ర యోగాలు అన్నీ ఇన్నీ కావు. ముల్లాన్‌పూర్‌లో జరిగిన రెండో టీ ట్వంటీలో గంభీర్ అనుసరించిన వ్యూహంపైనే ఇప్పు డు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్నప్పుడు టాపార్డర్ బ్యాటర్లే కీలకమన్నది అం దరికీ తెలుసు. ఓపెనర్లు ఇచ్చే మెరు పు ఆరంభంపై మిగిలిన బ్యాటర్లు చెలరేగితే ఎంత టి టార్గెట్‌నైనా అందుకోవచ్చు.
అయితే మూడో స్థా నంలో ప్రధాన బ్యాటర్లను పక్కన పెట్టి అక్షర్ పటేల్ లాంటి బౌ లింగ్ ఆల్‌రౌండర్‌ను పంపించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సూర్య, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, దూబే వంటి హిట్టర్లు ఉన్నప్పటకీ వారందరినీ పక్కన పెట్టి అక్షర్ పటేల్‌ను పంపించాడు. ఈ ప్రయోగం పూర్తిగా బెడిసికొట్టింది. అక్షర్ పటేల్ కాసేపు క్రీజులో నిలి చినా బంతికో పరుగు చొప్పున తీయగలిగాడే తప్ప ధాటిగా ఆడలేకపోయాడు.
అత ను ఔటైన తర్వాత మిగిలిన బ్యాటర్లపై ఒత్తిడి పెరిగిపోయింది. ఇన్నింగ్స్ లయ కూడా దెబ్బతింది. కేవలం గంభీర్ చేసిన పిచ్చి ప్రయోగంతోనే భార త్ ఓడిపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అక్షర్ పటేల్‌ను మూడో ప్లేస్ లో పంపించడం ఎంతమా త్రం సరైనది కాదని మాజీ ఓ పెనర్ రాబిన్ ఊతప్ప వ్యా ఖ్యానించాడు. టీ20 ప్రపంచకప్‌కు సమయం దగ్గర పడు తుండగా భారత్ మరో 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడుతుం ది. ఇలాంటి సమయంలో బ్యాటింగ్ ఆర్డర్‌లో పనికిమాలిన ప్రయోగాలు చేయొద్దని మాజీలు సూచిస్తున్నారు.
ఈ ప్రయోగాలు కారణంగా బ్యాటింగ్ ఆర్డర్ లయ కూడా దెబ్బతింటుందని అభిప్రాయపడుతున్నారు. రెగ్యులర్‌గా ఆడే ప్రధాన బ్యాటర్లను పక్కనపెట్టడం ఏమాత్రం సరికాదంటున్నా రు. అలాగే తుది జట్టు ఎంపికలో నూ గంభీర్ వ్యవహరిస్తున్న వ్యూ హాలు కూడా విమర్శలు పాలవుతున్నాయి. అంతర్జాతీయ టీ 20ల్లో అంతగా రాణించని గిల్ కు వరుస అవకాశాలు ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది. గిల్ కోసం సంజూ శాంసన్ కెరీర్‌ను పణంగా పెడుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తం మీద బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలకు ముగింపు పలికాలని మాజీలు వ్యాఖ్యానిస్తున్నారు. మరి గంభీర్ ఏం చేస్తాడో చూడాలి.




