మెస్సీ అభిమానుల విధ్వంసం
13-12-2025 01:13 PM
కోల్‌కతాలో సాల్ట్ లేక్ స్టేడియంలో(Salt Lake Stadium) ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ(Star footballer Lionel Messi) అభిమానులు విధ్వంసానికి పాల్పడ్డారు. స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం నుండి వెళ్లిపోయాడు. మెస్సీ మ్యాచ్ ఆడకపోవడంతో అభిమానులు ఆందోళన చెందారు. కార్యక్రమం నిర్వహణలోపంపై కోల్‌కతా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్సీ పర్యటనకు ఏర్పాట్లు సరిగా లేవని అభిమానులు ఫైర్ అయ్యారు.
స్టేడియం నుంచి మెస్సీ 10 నిమిషాల్లోనే వెళ్లిపోవడంతో ఆగ్రహించిన అభిమానులు మైదానంలోకి కుర్చీలు, వాటర్ బాటిల్లు విసిరేశారు. అంతటితో ఆగకుండా మైదానంలోకి దూసుకెళ్లి టెంట్లు, ప్లెక్సీలు చించి, బోర్డులు ధ్వంసం చేశారు. మెస్సీని చూసేందుకు భారీగా అభిమానులు స్టేడియానికి వచ్చారు. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. బారికేడ్లు దాటుకుని చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో సాల్ట్ లేక్ స్టేడియంలో భద్రత పెంచారు. కోల్ కతా ఘటనతో రాచకొండ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఉప్పల్ స్టేడియం దగ్గర అదనపు బలగాలను మోహరించారు. అభిమానులు గ్రౌండ్ లోకి రాకుమా పోలీసులు చర్యలు చేపట్టారు.




