calender_icon.png 28 October, 2025 | 5:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ప్రశాంతంగా ముగిసిన మద్యం దుకాణాల డ్రా

28-10-2025 12:20:15 AM

జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 27, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపు కోసం నిర్వహించిన డ్రా కార్యక్రమం సోమవారం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ము గిసింది. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆధ్వర్యంలో కొత్తగూ డెం క్లబ్లో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య తదితర అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్దే శించిన మార్గదర్శకాలను పూర్తిగా అనుసరించి, మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపు ప్రక్రియను పూర్తిగా పారద ర్శకంగా మరియు నిష్పక్షపాతంగా నిర్వహించామని తెలిపారు.

అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు లాటరీ విధానంలో డ్రా నిర్వహించామని, ప్రతి దశలోనూ మానవీయ జోక్యం లేకుండా ప్రక్రియను పూర్తిచేశామని పే ర్కొన్నారు.కార్యక్రమం మొత్తం సీసీటీవీ పర్యవేక్షణలో, వీడి యో రికార్డింగ్తో, ఎల్‌ఈడి స్క్రీన్ ద్వారా ప్రజల సమక్షంలో స్పష్టమైన నియమ నిబంధనల ప్రకారం నిర్వహించబడిందని తెలిపారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన డ్రా కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటలకు ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ వివరించారు. జిల్లాలో మొత్తం 3,922 దరఖాస్తులు అందగా, 88 దుకాణాల లైసెన్సులు కేటాయించబడ్డాయని కలెక్టర్ వెల్లడించారు. మండలాల వారీగా లైసెన్సుల వివరాలను అధికారికంగా ప్రకటించారు.

ఎంపికైన అభ్యర్థులు నిర్దేశిత కాలవ్యవధిలో లైసెన్స్ ఫీజులు చెల్లించి, షాపుల స్థాపనకు సంబంధించిన తదుపరి చర్యలు పూర్తి చేయాలని సూ చించారు. మద్యం విక్రయం విషయంలో ప్రభుత్వం నిర్దేశించిన నియమాలు, సమయాలు, పరిమితులు తప్పనిసరిగా పాటించాలని, వాటిని ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖ ప్రధాన లక్ష్యం ఆదాయం సమీకరణతో పాటు మద్యం నియంత్రణలో చట్టబద్ధమైన పద్ధతులను పాటించడం అని కలెక్టర్ పేర్కొన్నారు. అనుమతి లేకుండా మద్యం విక్రయించే అక్రమ దుకాణాలు, బెల్ట్ షాపులు, నకిలీ మద్యం తయారీ కేంద్రాలపై ప్రత్యేక దాడులు, సర్వేలు కొనసాగుతాయని తెలిపారు.

ప్రజలు కూ డా సామాజిక బాధ్యతతో ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై అధికారులకు సమాచారం అందించాలని కోరారు.డ్రా కార్యక్రమం ఎటువంటి గందరగోళం లేకుండా, సమగ్రమైన ఏర్పా ట్లతో ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసిందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వ హించడంలో అభ్యర్థులు, అధికారులు, సిబ్బంది అందరూ సహకరించినందుకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రహమాన్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ కరంచంద్, సంబంధిత శాఖాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.