calender_icon.png 28 October, 2025 | 7:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాపాలన ముసుగులో రాక్షస పాలన

28-10-2025 12:18:49 AM

- కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజా పాలన కాదు, ప్రజా కంఠక పాలన.. 

- ముగ్గురు మంత్రులు ఉన్న అభివృద్ధిలో మౌనం 

- కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అధ్వానంగా రోడ్లు 

- ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ మోసాలను ఎండ గడతాం

- బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాంతారావు

- ప్రభుత్వ మొండి వైఖరికి ఫై బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన

మణుగూరు,అక్టోబర్ 27,( విజయక్రాంతి) : రేవంత్రెడ్డి సర్కారు ప్రజా పాలన ముసుగులో రాక్షస పాలన సాగిస్తుందని, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్ర శ్నించే నాయకులను ప్రభుత్వం గొంతు నొక్కుతోందని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అ ధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మండిపడ్డారు. అస్తవ్యస్తంగా మారిన గ్రామీ ణ జాతీయ రహదారుల దుస్థితిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులతో కలిసి స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు సోమవారం భారీ ఆం దోళన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాంతారావు మా ట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రోడ్లన్నీ ధ్వంసమైనట్లు తెలిపారు. నియోజవర్గంలో ఇసుక మాఫియా దోపిడీతో రో డ్లన్నీ పాడైపోయి ప్రజలు నరకయాతన అనుభవిస్తుంటే  మంత్రులు, ప్రజా ప్రతినిధులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తు న్నారని దుయ్యబట్టారు. నియోజకవర్గంలో అనేక సమస్యలు విలయతాండవం చేస్తున్నట్లు చెప్పారు. రహదారులు అస్తవ్యస్తంతో ప్రజల ఇబ్బందులపై పార్టీ ఆధ్వర్యంలో సె ల్ఫీ డిజిటల్ క్యాంపెనింగ్, కార్యక్రమం చేపట్టి మీడియాలో, సమస్యలను వివరించిన ప్రజాప్రతినిధులు, అధికారులలో చలనం లేదని, వారు మొద్దునిద్ర వీడటం లేదన్నారు.

కాం గ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఏళ్లు గడిచిన నియోజకవర్గం రోడ్లను కూడా మరమ్మతు చేపట్టలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంద ని విమర్శించారు. గత పది సంవత్సరాల బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు తప్ప, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. అద్వానంగా గుంతలమయమై ఉన్నా రోడ్లపై కనీసం తట్టెడు మట్టి కూడా పోయలేదని ఆరోపించారు.

ఆక్షే పించారు. ప్రజల చేత కంటతడి 

పెట్టించిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించినట్లు చరిత్రలో లేదన్నారు. మరోవైపు సింగరేణి, బీటీపీఎస్, ఐటీసీ వంటి పరిశ్రమలు అభివృద్ధి కోసం ఇచ్చే కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కొడంగల్కు మళ్లి స్తోందని అనుమానం వ్యక్తం చేశారు. వంద నుండి రెండు వందల కోట్లు నిధులు ఎక్కడికి పోతున్నాయో ప్రజలకు సమాధానం చెప్పాలని కాంతారావు ప్రశ్నించారు. ప్రజా పాలనను గాలికి వదిలేసిన మంత్రులు విలాసాలతో కాలం గడుపు తున్నారని ఆరోపిం చారు. పరిశ్రమలు కేటాయించే సిఎస్‌ఆర్ నిదులతో తక్షణ మే రోడ్ల మరమ్మతులను చేపట్టాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. రోడ్డు మరమ్మ తులు చేయకపోతే భద్రాద్రి పవర్ ప్లాంట్ కు బొగ్గు రవాణా చేసే లారీలను కదల నివ్వం అని హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు కుర్రి నాగేశ్వరరావు, కుంట లక్ష్మణ్, పోశం నరసింహారావు, ముత్యం బాబు, వట్టం రాంబాబు, నూకారపు రమేష్, ముద్దం గుల కృష్ణ, బోసే ట్టీ రవికుమార్, జావిద్ పాషా, రవి తదితరులు పాల్గొన్నారు.