calender_icon.png 24 February, 2026 | 2:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పసిపాప ప్రాణం తీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

24-02-2026 01:02:09 PM

బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు చెరుకు శ్రీరామ్ గౌడ్ 

మర్రిగూడ,(విజయక్రాంతి): నాగర్ కర్నూలు జిల్లా(Nagarkurnool District) కుమ్మెర గ్రామంలో కులవ్యవక్షత చూపిన రెడ్డి సామాజిక వర్గాన్ని చట్టపరంగా శిక్షించి పసిపాప ప్రాణానికి కారకులైన వారినీ వెంటనే కఠినంగా శిక్షించాలని మర్రిగూడ మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చెరుకు శ్రీరాములు గౌడ్ కోరారు. మంగళవారం మర్రిగూడ మండల విలేకరులతో ఆయన మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు దాటిన అగ్రవర్ణాలు మాత్రం కుల వివక్షత పై దుమారం లేపుతున్నారని బిసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇతర కులాలను రాజకీయం సామాజికం ఆర్థికంగా అనగదొక్కడానికి రెడ్డి సామాజిక వర్గాల చర్యలు కొనసాగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు భారతీయ సంస్కృతిని అడుగంటే విధంగా వ్యవహరిస్తున్న వ్యక్తులపై  చర్యలు తీసుకుంటూ పసిపాప ప్రాణం తీసిన వారిని అదుపులోకి తీసుకొని చట్టపరంగా శిక్షించాలని ఆయన కోరారు