సార్ మీరు తలుచుకుంటే మా జీవితాలు బాగుపడతాయి
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావుకు రెండవ ఏఎన్ఎంల మొర
సుల్తానాబాద్,(విజయక్రాంతి): సార్ మీరు తలుచుకుంటే మా రెండవ ఏఎన్ఎంల జీవితాలు బాగుపడతాయి. మాకు రెగ్యులర్ అవుతాయి. 20 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో పని భారంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. గత ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులర్ చేస్తానని చేయలేదు, మీరు ముఖ్యమంత్రికి చాలా దగ్గర మీరు తలుచుకుంటే మా రెండవ ఏఎన్ఎంలు అందరూ రెగ్యులర్ అవుతారంటూ తమ బాధలను చెప్పుకుంటూ ప్రభుత్వవిప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుకు మంగళవారం రెండవ ఏఎన్ఎంలు వినతిపత్రం అందజేశారు.
తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని గత ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ విధానాలకు నిరసనగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ధర్నా చేస్తే ప్రతిపక్ష నాయకునిగా హాజరై మాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నేడు తమరు ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పు గా ఉన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు అత్యంత సన్నిహితులు, మా సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మా యొక్క రెండవ ఏఎన్ఎంల బాధలను సీఎం దృష్టికి తీసుకువెళ్తే మీ మాట తీసివేయక వెంటనే మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం మాకు ఉందని రెండవ ఏఎన్ఎంలు వాపోయారు.
పని భారంతో ప్రభుత్వం చేస్తున్న ప్రతి సంక్షేమ పథకంలో మేము భాగస్వామ్యం ఐ తూచా తప్పకుండా విధులు నిర్వహిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్నామని, అదనంగా పనిభారం మోపిన చేస్తున్నామని ప్రభుత్వ వి ప్ ఎమ్మెల్యే విజయ రమణారావు కు తమ మొరను వినిపించారు. స్పందించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు... అనంతరం విజయ రమణారావు ను ఘనంగా సన్మానించారు,




