24 July, 2026 | 11:41 AM

మహిళ అదృశ్యం

24-07-2026 10:39 AM

ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలి

భిక్కనూర్, జూలై 23(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన కారుణ్య లావణ్య (28), భర్త గణేష్, కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో తన 9 నెలల కుమార్తె రీతికతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. లావణ్య చామనఛాయ రంగుతో, సుమారు 5 అడుగుల ఎత్తు ఉండగా, ఎడమ చేతిపై టాటూ గుర్తు ఉంది. ఆమె ఆచూకీ తెలిసిన వారు లేదా ఎక్కడైనా కనిపించినట్లయితే వెంటనే భిక్కనూర్ ఎస్‌ఐ ఎస్. అనిల్ , 8712686154 నంబర్‌లో సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.