24 July, 2026 | 11:09 AM

విద్యార్థులపై లెక్చరర్ దాష్టీకం

24-07-2026 10:37 AM

విద్యార్థులను చితకబాదిన లెక్చరర్

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘటన

ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసిన విద్యార్థుల కుటుంబీకులు

చుంచుపల్లి,( విజయక్రాంతి): విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయుడు విచక్షణ జ్ఞానాన్ని మరిచి పిడుగులతో విద్యార్థులపై విరుచుకుపడిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూనియర్ కళాశాలలో గురువారం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయ. కళాశాలలో ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న రేపాక ఆదిత్య వల్లపు ఆదిత్య మూడు రోజుల క్రితం కళాశాలకు వెళ్లారు. పాఠాలు బోధించే లెక్చరర్ బండి లక్ష్మణ్ తరగతి గదిలో నవ్వుతున్నార నీ అక్కసుతో ఒక్కసారిగా విద్యార్థులను అందరు చూస్తుండగానే చితక బాదాడు. దీంతో విద్యార్థులు ఇంటికి వెళ్లి మూడు రోజులు పాటు కళాశాలకు రాకుండా అనారోగ్యం పాలై మంచాన పడ్డారు.

విద్యార్థుల పరిస్థితిని చూసి వారి కుటుంబ సభ్యులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది తరగతి గదిలో లెక్చరర్ ఇష్టానుసారంగా పిడుగులు గుద్దుతూ విపరీతంగా  కొట్టాడని కుటుంబీకులకు చెప్పడంతో విషయం తెలుసుకున్న విద్యార్థుల కుటుంబీకులు గురువారం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వచ్చి జరిగిన విషయంపై తక్షణమే ఆ లెక్చరర్ పై చర్య తీసుకోవాలని సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ కత్తి రమేష్ కు వినతిపత్రం అందించారు. దీంతోపాటు చదువుకునేందుకు వస్తున్న పిల్లలను ఇంత దారుణంగా ఎందుకు కొట్టారని సంబంధిత లెక్చరర్ ని తరగతి గదిలో నిలదీశారు. దీంతో లెక్చరర్ బండి లక్ష్మణ్ సమాధానం ఇస్తూ ఇష్టానుసారంగా విద్యార్థులు అల్లరి చేస్తున్నారని కొట్టానని విద్యార్థులు కొట్టడం తాను చేసిన తప్పిదమైనని తెలిపారు.  ఈ విషయంపై లెక్చరర్ బండి లక్ష్మణ్ పై చర్యలు తీసుకోవాలని సంబంధిత ప్రిన్సిపాల్ కు వినతిపత్రం అందించారు. అవసరమైతే న్యాయం కోరుతూ పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.