2 May, 2026 | 9:22 PM

Breaking News

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం   •   విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •  

పశువులకు తప్పనిసరిగా టీకా వేయించాలి

11-03-2026 01:25 AM

దండేపల్లి (లక్షెట్టిపేట), మార్చి 10: జిల్లాలోని పాడి రైతులు తమ పశువులకు తప్ప నిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేయించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం దండేపల్లి మండలం రాజంపేటలో జిల్లా పశుసంవర్ధక, పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమానికి జిల్లా పశువైద్య శాఖ అధికారి యాకుబ్ రెడ్డి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్ లతో కలిసి హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. పాడి రైతులు తమ పశువులకు ఏమైనా సమస్యలున్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించా లని సూచించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య శాఖ అధికారులు, రైతులుపాల్గొన్నారు.