11 July, 2026 | 8:34 PM

Breaking News

జవహర్ నవోదయలో ప్రవేశాలకు ఆహ్వానం   •   గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం.. రూ.1 లక్ష ఆర్థిక సాయం: మాజీ మంత్రి కేటీఆర్   •   అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం   •   దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్   •   పినపాక మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్   •   శాతవాహన క్రీడా మైదానంలో 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణానికి భూమి పూజ   •   ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన   •   మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •  

రతన్ టాటా నిజమైన లెజెండ్

10-10-2024 01:21 PM

న్యూఢిల్లీ: రతన్ టాటా నిజమైన లెజెండ్ అని భాజపా సీనియర్‌ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే ఆడ్వాణీ అన్నారు. తాను అభిమానించే వ్యాపారసంస్థల్లో టాటా గ్రూప్ ఒకటని ఆడ్వానీ తెలిపారు. టాటా గ్రూప్ వైభవాన్ని దశాబ్దాలపాటు రతన్ ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. జేఆర్డీ టాటా వారసుడిగా తానమేంటో నిరూపించుకున్నారని ఆయన తెలిపారు. తాను భారత రత్న అందుకున్న సందర్భంగా అభినందనలు చెబుతూ రతన్ టాటా లేఖ పంపించారని గుర్తుచేసుకున్నారు. భారత పరిశ్రమపై టాటా చెరగని ముద్ర వేసారని మాజీ ఉప ప్రధాన మంత్రి తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. భారతదేశంలోని అతిపెద్ద సమ్మేళనాలలో ఒకటైన టాటా సన్స్ ఛైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా, 86 ఏళ్ళ వయసులో మరణించారు. సోమవారమే, పారిశ్రామికవేత్త సోషల్ మీడియా పోస్ట్‌లో తన ఆరోగ్యంపై ఉన్న ఊహాగానాలను తోసిపుచ్చారు. అతని వయస్సు కారణంగా సాధారణ వైద్య పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ బుధవారం అర్థరాత్రి ఒక ప్రకటనలో టాటా మరణాన్ని ప్రకటించారు.