11 July, 2026 | 8:41 PM

Breaking News

జవహర్ నవోదయలో ప్రవేశాలకు ఆహ్వానం   •   గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం.. రూ.1 లక్ష ఆర్థిక సాయం: మాజీ మంత్రి కేటీఆర్   •   అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం   •   దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్   •   పినపాక మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్   •   శాతవాహన క్రీడా మైదానంలో 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణానికి భూమి పూజ   •   ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన   •   మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •  

లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

11-07-2026 08:07 PM

- ప్రమాదంలో ఒకరి మృతి

వెంకటాపూర్,(విజయక్రాంతి): మండలంలోని లింగాపూర్ స్టేజ్ వద్ద జాతీయ రహదారి-163 పై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మల్లంపల్లి గ్రామానికి చెందిన తుర్పాటి పెద్దులు (55) ద్విచక్ర వాహనంపై చిరు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శనివారం ఉదయం సుమారు 5:30 గంటలకు మచ్చాపూర్ వైపు వెళ్తుండగా, ఏటూరునాగారం వైపు వెళ్తున్న ఓ లారీ అతివేగంగా వచ్చి ఆయన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో పెద్దులు లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎస్ఐ చల్లా రాజు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ చల్లా రాజు తెలిపారు.