26 May, 2026 | 7:30 AM

అర్హత ఉన్న ప్రతీ రైతుకు రుణమాఫీ చేస్తాం

19-08-2024 09:00 PM

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్న రైతులకు రుణమాఫీ చేశామని మంత్రి జూపల్లి కృష్షారావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేస్తోందని, సాంకేతిక కారణాల వల్ల నిలిచిన రుణాలు మాఫీ చేస్తామని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే సాంకేతిక కారణాలు వచ్చాయని, కేటీఆర్, హరీశ్ రావు సవాళ్ల నుంచి తప్పించుకోవడానికే ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హత ఉన్న ప్రతిరైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందన్నారు.