రాజకీయ దురుద్దేశంతో వివక్షాలు తప్పుడు ప్రచారం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రుణమాఫీ దేశంలో ఇంతవరకూ ఎప్పుడూ జరగలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాజకీయ దురుద్దేశంతో వివక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఉత్తమ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీపై ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి.. ఆగస్టు 15 లోపు చేసిందని ఆయన కొనియడారు.సాంకేతిక కారణాల వల్ల రుణమాపీ జరగని వారికి కచ్చితంగా చేస్తామని మంత్రి చెప్పారు. ఈ పంటకు సన్నాలకు రూ.500 బోనస్ ఇవ్వబోతున్నామన్నారు.
2014, 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలస్యంగా రుణమాఫీ చేసిందని, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన రుణమాఫీ రైతుల బ్యాంకు వడ్డీలకే సరిపోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు తీసుకున్న రుణం, వడ్డీ మొత్తం మాఫీ చేశామని, 2018లో రైతు రుణమాఫీపై అనేక ఫిర్యాదులు వస్తే పరిష్కరించలేదన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకు కేటీఆర్ లేఖ ప్రచారం కోసం మాత్రమే అని మంత్రి ఉత్తమ్ దుయ్యబట్టారు.






