కేటీఆర్ వ్యాఖ్యాలపై ఘాటుగా స్పందించిన మంత్రి సీతక్క
19-08-2024 09:31 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యాలపై రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క సీతక్క ఘాటుగా స్పందించింది. అంత లక్షణంగా ఉంటే లక్షన్నర కేసులెందుకు..? అని సీతక్క పేర్కొన్నారు. రాఖీ పండుగరోజు కూడా మహిళ నేతలపై నిందలా..? అని మంత్రి ప్రశ్నించారు. ఆస్తి, అంతస్తులతో సంబంధం లేకుండా స్త్రీలను గౌరవించాలన్నారు. మహిళా భద్రతపై మీతో చెప్పించుకోవాల్సిన స్థితిలో లేం అని సీతక్క దుయ్యబట్టారు.






