3 May, 2026 | 8:37 PM

రుణమాఫీ ఓ భూటకం

03-12-2024 05:09 PM

ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు...

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయడం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి మాటలు బూటకమని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మంగళవారం కౌటాల  మండల కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాలయం ఎదుట రుణమాఫీ కాని రైతులతో కలసి రోడ్డుపై ఎమ్మెల్యే బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూరు శాతం రెండు లక్షల లోపు రుణమాఫీ పూర్తయింది అనడం హాస్యాస్పదంగా ఉందని, ఈ సంవత్సరపు అతిపెద్ద జోక్ ఇదే అని ఎద్దేవా చేశారు. కౌటాల మండలం ముత్యంపేట గ్రామీణ బ్యాంకులో 40 శాతం మందికి కూడా రుణమాఫీ పూర్తి కాలేదని తెలిపారు. ముఖ్యమంత్రి సొంత గ్రామం కొండారెడ్డిపల్లెలో కూడా పూర్తిస్థాయి రుణమాఫీ కాలేదని నిరూపించడానికి సిద్ధమని తెలియజేశారు. విజయోత్సవాల పేరిట సమయం వృధా చేయకుండా ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మండలంలో రైతులు పాల్గొన్నారు.