1 September, 2026 | 1:42 AM

అనారోగ్యంతో బాధపడుతున్న బాధితుడికి మంత్రి శ్రీధర్ బాబు అండ

31-08-2026 11:25 PM

రూ.2.50 లక్షల ఎల్వోసీ అందజేత

ముత్తారం గ్రామానికి చెందిన జక్కుల రమేష్‌కు సీఎంఆర్ఎఫ్ వైద్య సహాయం

మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపిన రమేష్ కుటుంబ సభ్యులు

ముత్తారం(విజయ క్రాంతి): ఆపదలో ఉన్న పేదలకు అండగా నిలవడంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎల్లప్పుడూ ముందుంటారని మరోసారి నిరూపితమైంది. మంథని నియోజకవర్గం, ముత్తారం మండల కేంద్రానికి చెందిన జక్కుల రమేష్ తీవ్ర అనారోగ్య సమస్యతో హైదరాబాద్‌లోని నిమ్స్  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆర్థిక స్తోమత లేక వైద్య ఖర్చుల నిమిత్తం సహాయం చేయాలని రమేష్ కుటుంబ సభ్యులు మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. బాధితుడి పరిస్థితిపై వెంటనే స్పందించిన మంత్రి... ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 2,50,000 విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ ఎల్బోసి ను మంజూరు చేయించారు.

హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆస్పత్రి సహాయకుల ద్వారా బాధితుడి కుటుంబ సభ్యులకు ఈ ఎల్వోసీ పత్రాన్ని అందజేశారు. అత్యవసర సమయంలో స్పందించి రూ.2.50 లక్షల వైద్య సహాయం అందించి తమ ప్రాణాలు నిలబెట్టేందుకు భరోసానిచ్చిన మంత్రి శ్రీధర్ బాబుకు బాధితుడు జక్కుల రమేష్ మరియు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు.