1 September, 2026 | 12:57 AM

లబ్ధిదారునికి ఎల్ఓసీ పత్రం అందజేసిన ఎమ్మెల్యే విజయుడు

01-09-2026 12:21 AM

ఇటిక్యాల: అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద లబ్ధిదారునికి ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కొండంత అండగా నిలుస్తుందని ఆలంపూర్ శాసనసభ్యులు విజయుడు తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బుడ్డారెడ్డిపల్లె గ్రామానికి చెందిన వడ్డే ప్రశాంత్ తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో, మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల ఎల్ఓసీ  మంజూరైంది. సోమవారం ఈ ఎల్ఓసీ పత్రాన్ని లబ్ధిదారుడు వడ్డే ప్రశాంత్‌కు ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల వైద్యం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, బాధితుడికి త్వరలోనే పూర్తి గుణం చేకూరాలని ఆకాంక్షించారు.