అర్ధనగ్నంగా ఉన్నది నేను కాదు!
01-09-2026 01:38 AM
‘అర్జున్‌రెడ్డి’ భామ శాలినీ పాండేను పోలిన ఒక అర్ధనగ్న వీడియో రెండ్రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ వీడియోపై శాలినీ స్పందించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. “అది ఏఐ డీప్ ఫేక్ వీడియో.
ఆ వీడియోకు, నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ వీడియో పూర్తిగా కల్పితం, అందులో ఉన్నది నేను కాదు. టెక్నాలజీని ఉపయోగించి మహిళలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి పనులు చేయడం అత్యంత ఆందోళనకర. టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి వాటిని ఎవరూ సాధారణ విషయాలుగా తీసుకోకూడదు” అని రాసుకొచ్చింది. ‘ఈ వీడియోను ఎవరూ షేర్, ఫార్వార్డ్, డౌన్‌లోడ్ చేయొద్దని, సోషల్ మీడియాలో కనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేయాలని శాలినీ నెటిజన్లను కోరింది.






