15 April, 2026 | 3:16 AM

దివ్యాంగుడికి రూ.1.25 లక్షల ఎల్‌ఓసీ అందజేత

15-04-2026 12:00 AM

నవాబుపేట ఏప్రిల్ 14: గ్రామానికి చెందిన పేదలకు, ఆపదలో ఉన్నవా రికి అండగా నిలవడంలో ప్రజా ప్రతిని ధులు తమ ఉదారతను చాటుకుంటు న్నారు. చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఏనుగొండ అంజయ్య అనే వ్యక్తికి కృత్రిమ కాలు అమర్చుకోవడం కోసం భారీ ఆర్థిక సహాయం మంజూరైంది.

స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి సహకారంతో మరియు గ్రామ సర్పంచ్ చొరవతో అంజయ్య కు రూ. 1,25,000 వేల విలువైన ఎల్‌ఓసి చెక్కును అందజేశారు. ఈ ఆర్థిక సహాయానికి సంబంధించిన పత్రాలను గ్రామ సర్పంచ్  బడుగుల నవనీత రవి లబ్ధిదారుడికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఎల్లప్పుడూ అండగా ఉంటున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ,పంచాయతీ కార్యదర్శి ముంత నరసింహులు ,వార్డు సభ్యులు, గ్రామ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.తమకు అండగా నిలిచిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, సర్పంచ్ నవనీత రవి లకు లబ్ధిదారుడు అంజయ్య కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.