15 April, 2026 | 3:16 AM

ఎన్.హెచ్‌పై ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు

15-04-2026 12:00 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా పరిధిలోని వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని తొర్రూర్ పోలీసులు ముందస్తు నివారణ చర్యలు చేపట్టారు. ఈ మేరకు మంగళవారం తొర్రూర్ సీఐ గణేష్, ఎస్ ఐ ఉపేందర్ ఆధ్వర్యంలో నాంచారి మడూరు నుండి మాటేడు వరకు జాతీయ రహదారి ఇరువైపులా తరసుగా ప్రమాదాలకు కారణమవుతున్న అంశాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం జరిగింది.

ప్రత్యేకంగా రహదారి పక్కన ఉన్న ముళ్ళ పొదలు తొలగించి, ఎత్తున భూమిని చదును చేయించారు. అలాగే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్న ప్రదేశాలలో వాహనదారులను అప్రమత్తం చేస్తూ హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. రహదారి భద్రతకు పోలీసులు చేపట్టిన చర్యల పట్ల ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.