15 April, 2026 | 3:16 AM

చారకొండ బైపాస్‌పై ప్రమాదాల నివారణకు చర్యలు

15-04-2026 12:00 AM

* విజయక్రాంతి కథనానికి స్పందించిన అధికారులు

* బైపాస్ రోడ్డుపై బారికేడ్ల ఏర్పాటుకు చర్యలు

 - క్షేత్రస్థాయిలో ఎస్త్స్ర, తహసీల్దార్ పరిశీలన

చారకొండ, ఏప్రిల్ 14: ఆ చౌరస్తాలు.. మృత్యుపాశాలు! అనే శీర్షికతో విజయక్రాంతి దినపత్రికలో సోమవారం ప్రచురితమైన కథనంపై స్థానిక యంత్రాంగం వేగంగా స్పందించింది. మండల ఎస్త్స్ర వీరబాబు, స్థానిక సర్పంచ్ విజేందర్ గౌడ్, తహసీల్దార్ ఉమతో కలిసి ప్రమాదకరంగా మారిన బైపాస్ రోడ్డును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్త్స్ర మాట్లాడుతూ..వాహనదారల భద్రతే తమ ప్రాధాన్యతని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు

రాత్రి వేళల్లో వాహనదారులకు రోడ్డు స్పష్టంగా కనిపించేలా అవసరమైన చోట హెచ్చరిక బోర్డులు, రేడియం సూచికలు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడిన అధికారులు, రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. అతివేగం, అజాగ్రత్త వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. ప్రజా సమస్యలపై స్పందించి వార్తను ప్రచురించిన పత్రికా యాజమాన్యానికి, ప్రతినిధులకు ఈ సందర్భంగా గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు.