calender_icon.png 17 September, 2025 | 7:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్

17-04-2025 09:05:09 AM

అమరావతి: కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో(Kadapa Two Town Police Station) గంజాయి కేసు నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. లాకప్‌లో బాత్రూంలో గ్రిల్‌కు చొక్కాతో ఉరేసుకుని షేక్ సోను బలవన్మరణానికి పాల్పడ్డాడు. కడప నకాష్ వీధికి చెందిన సోనును నిన్న రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ కోర్టులో హాజరుపర్చాల్సి ఉండగా షేక్ సోను ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు కడప రిమ్స్ కు తరలిస్తున్నారు. గతేడాది కూడా షేక్ సోనుపై టూటౌన్ పీఎస్ లో గంజాయి కేసు(Ganja case) నమోదైందని పోలీసులు వెల్లడించారు.