calender_icon.png 2 December, 2025 | 11:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోక్‌సభ వాయిదా

02-12-2025 11:29:52 AM

ఎస్ఐఆర్ పై విపక్షాల పట్టు

వాడీవేడిగా పార్లమెంట్ సమావేశాలు.. 

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు(Parliament Winter Session) రెండో రోజూ ప్రారంభమై కొనసాగుతున్నాయి. రెండోరోజు కూడా పార్లమెంట్ సమావేశాలు వాడీవేడీగా జరుగుతున్నాయి. ఎస్ఐఆర్(Special Intensive Revision)పై చర్చించాల్సిందేనని పట్టుబట్టిన ప్రతిపక్ష ఎంపీలు ఓట్ చోరీ చేస్తున్నారంటూ నినాదాలు చేశారు. సభ్యులు నియమనిబంధనలు పాటించాలని స్పీకర్ కోరారు. సభలో నిరసనలు పెరగడంతో స్పీకర్ ఓం బిర్లా(Speaker Om Birla) లోక్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.