02-12-2025 11:06:29 AM
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని చంద్రారెడ్డి గార్డెన్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొని స్విగ్గీ డెలివరీ బాయ్(Swiggy delivery boy) మృతి చెందాడు. మృతుడిని అజిత్ కుమార్ (23)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.